తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today: టాప్​న్యూస్ @9AM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jul 20, 2022, 8:59 AM IST

  • వరద గరిష్ఠంగా వెళ్లిన జులై ఇదే కానుందా!

గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వరద ఈ ఏడాదే అత్యధికం కానున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జులైలో గోదావరి నుంచి సముద్రంలోకి 100 నుంచి 500 టీఎంసీలు మాత్రమే వెళ్లేది. ఇంతకు మించి వెళ్లిన సంవత్సరాలు చాలా తక్కువ. కానీ, ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • మిల్లుల్లోనే ధాన్యం మొలకెత్తుతున్నా.. ఎవరికీ పట్టదే..?

Wet Paddy in Rice mills : కేంద్ర సర్కార్ జాప్యం.. రాష్ట్ర ప్రభుత్వ అయోమయం వెరసి.. రాష్ట్రంలో ధాన్యం నిల్వలపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. మిల్లుల్లో కుప్పలు తెప్పలుగా నిల్వ ఉన్న ధాన్యమంతా మొన్నటి వరకు కురిసిన వానలకు తడిసిముద్దయింది. చాలా మిల్లుల్లో ధాన్యమంతా మొలకలు వచ్చింది. తడిసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం కష్టం. అందుకే తడిసిన ధాన్యాన్ని వేలం వేసి వచ్చిన మొత్తంతో సరిపెట్టుకునే యోచనలో ఉంది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ.

  • ఆర్జీయూకేటీలో 1,078 మందికి దృష్టి లోపాలు

RGUKT Basar News: బాసర ఆర్‌జీయూకేటీని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా విద్యార్థుల్లో పలువురు కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. జూన్‌ 22 నుంచి ఈ నెల 5 వరకు విశ్వవిద్యాలయంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. మొత్తం 4,876 మందిని పరీక్షించగా.. 1,078 మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు బయటపడింది.

  • ఫూటుగా మందు తాగి పట్టుబడితే.. రక్తదానమే!

Drunken Drivers Have to Donate Blood : ఇతర రాష్ట్రాలు ఏవైనా ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడితే.. వాటిని మన రాష్ట్రంలోనూ అమలు చేయడంలో తెలంగాణ సర్కార్ ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే మందుబాబులపై పంజాబ్ రాష్ట్రం అమలు చేస్తున్న ఓ వినూత్న కార్యక్రమాన్ని తెలంగాణలోనూ ప్రారంభించే దిశగా యోచన చేస్తోంది. ఇంతకీ అదేంటంటే.. ఫూటుగా మందు తాగి.. వాహనాలు నడిపితే.. జరిమానా, లైసైన్స్ రద్దుతో పాటు.. రక్తదానం చేయాల్సి ఉంటుంది. మరి మందుబాబులు జాగ్రత్త.. చుక్క లోపల పడితే.. నెత్తురు కళ్లచూడటమే ఇక.

  • డిజిటల్ వేలిముద్రలతో ఈజీగా దొరికేస్తారు..

Digital fingerprints : దొంగల ఆటకట్టించేందుకు పోలీసులు వేగంగా ఆధునిక సాంకేతిక బాట పడుతున్నారు. సీఐడీలోని ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో తెలుగు రాష్ట్రాల్లో తరచుగా నేరాలకు పాల్పడే 7.82 లక్షల మంది వేలిముద్రలు సేకరించింది. వీటిని సెంట్రల్‌ సర్వర్‌ ద్వారా లైవ్‌ స్కానర్లకు అనుసంధానం చేశారు. అవి జిల్లా పోలీసులకు సైతం అందుబాటులో ఉన్నాయి. జిల్లా పరిధి గస్తీ పోలీసులు పెట్రోలింగ్‌లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన వారి వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి పాత నిందితుడైతే సర్వర్లో నిక్షిప్తమైన వేలిముద్రలతో సరిపోలి వెంటనే వారి నేర చరిత్ర అంతా గస్తీ పోలీసులకు అందుతుంది. ఏడాది క్రితం ప్రవేశ పెట్టిన ఈ విధానంతో మంచి ఫలితాలు రావడం, నేరస్థులు పట్టుబడుతుండటంతో వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో ఈ విధానం అములు తీరుతెన్నులపై ఈటీవీ భారత్‌ కథనం.

  • లగేజీ ఛార్జీలు భారీగా పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Luggage Charges Hike in TSRTC : మాటిమాటికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ ఈసారి లగేజీ ఛార్జీలు పెంచింది. ఈ ఛార్జీలను భారీగా పెంచుతూ టీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

  • తిరుగుబాటుకు బాటలు వేసిన 'పిగ్ రూపాయి'

తుపాకుల తూటాలకు పంది, ఆవు కొవ్వులను పూతగా పూయడం వల్ల సిపాయిలు తిరగబడ్డారు. అది క్రమంగా ప్రథమ స్వాతంత్య్ర సమరానికి దారితీసింది. దీంతో బ్రిటిష్‌ పాలకులు గడగడలాడారు. ఆ భయం ఇంకా వారి గుండెల్లో ఉండగానే అటువంటి సంఘటన 1911లో ఒకటి జరిగింది. అయితే ఈసారి వారు తప్పును వేగంగా దిద్దుకున్నారు. లేదంటే ప్రజల నుంచి మరో భారీ తిరుగుబాటును చవిచూడాల్సి వచ్చేది.

  • 8రోజుల్లో కామన్వెల్త్‌ పోటీలు.. అదరగొడతారా?

కామన్వెల్త్‌ క్రీడలు మరో ఎనిమిది రోజుల్లో మొదలు కాబోతున్నాయి. ఈ సారి పోటీల్లో కొన్ని కొత్త ఆటలు చేరిన నేపథ్యంలో భారత్​కు కూడా ప్రాతినిథ్యం పెరిగింది. దీంతో ఈ మెగా టోర్నీలో సత్తా చాటి పతకాలు సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఆటగాళ్లు.

  • శ్రీలంకకు కొత్త నాయకత్వం..

Sri lanka president election 2022: గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు కొత్త నాయకత్వం రాబోతోంది. దేశ నూతన అధ్యక్షుడు, ప్రధానమంత్రిని బుధవారం ఎన్నుకోనున్నారు. అధ్యక్షుడిగా దులస్‌ అలహాప్పెరుమాకు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  • 'మహేష్‌బాబు అభిమానిగా కనిపిస్తా..'

నవతరానికి ప్రతిబింబంలా కనిపిస్తుంటారు... నాగచైతన్య. మనలో ఒకడిలా కనిపించే ఆయన ప్రేమకథల్లో ఇట్టే ఒదిగిపోతారు. భావోద్వేగాలతో కట్టిపడేస్తుంటారు. జీవితాలకి దగ్గరగా ఉండే కథలతో ప్రయాణం చేస్తున్న నాగచైతన్య ఇటీవల 'థ్యాంక్‌ యూ' చేశారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకులు ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగచైతన్య మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

ABOUT THE AUTHOR

...view details