- చుట్టూ నీళ్లు.. కానీ.. గుక్కెడు మంచినీరు లేదు
వరద ప్రభావం ఆదిలాబాద్ జిల్లాను ఇంకా వీడలేదు. చుట్టూనీళ్లున్నా.. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకడం లేదు. జిల్లాలోని పలు పల్లెల్లో మిషన్ భగీరథ పైపులు ధ్వంసం అవ్వడం వల్ల తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని భూపాలపల్లి, ఆసిఫాబాద్, నల్గొండ వంటి పలు జిల్లాల్లోని గ్రామాల్లో ఇలాంటి దుస్థితే ఉంది.
- తెలంగాణను కమ్మేస్తున్న క్యాన్సర్
తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి అత్యంత వేగంగా కోరలు చాస్తోంది. 2022లో క్యాన్సర్ బాధితులు 1,09,433 మంది ఉండగా.. 2030 నాటికి వీరి సంఖ్య 2.08 లక్షలు దాటుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. అంటే దాదాపు రెట్టింపు అవుతుంది.
- చీకట్లోనే పల్లెలు.. తాగునీళ్లు లేక తిప్పలు
వారం రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రమంతా అల్లకల్లోలమైపోయింది. వరద ప్రభావం ఇంకా పలు గ్రామాలపై అలాగే ఉంది. చాలా వరకు పల్లెలు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ లేక ఇప్పటికీ చీకట్లోనే గడుపుతున్నాయి. వరద సృష్టించిన బీభత్సంతో కొన్ని గ్రామాల ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద వల్ల పునరావాసాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి పయనమవుతున్నారు. తమ ఇళ్లల్లో పరిస్థితిని చూసి గుండెలు బాదుకుంటున్నారు.
- ఇద్దరు వైద్యులు, వార్డు బాయ్ సస్పెన్షన్
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన దంపతులకు కుట్లువేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వైద్య సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. ఇద్దరు వైద్యులు, వార్జుబాయ్‌ను సస్పెండ్ చేశారు. సిబ్బంది తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- తెల్లవారిని వణికించిన పోరాట యోధుడు!
విద్య, వైద్యం, భూములను ఎరవేసి మత మార్పిళ్లకు పాల్పడుతున్న తెల్లదొరలు, మిషనరీలను చూసి ఆ ఆదివాసీ యువకుడి రక్తం మరిగింది. తమను జలగల్లా పీల్చుకుతింటున్న పాలకుల తీరుపై ఆయన గుండె రగిలిపోయింది. స్వరాజ్య సాధనే లక్ష్యంగా సాయుధ పోరాటం నడిపిన ఆ విప్లవవీరుడు బ్రిటిష్ వారిని వణికించాడు. ఆదివాసీలకు ఆరాధ్య దైవమయ్యాడు. ఆ పోరాట యోధుడే.. బిర్సా ముండా!
- భారీగా తగ్గిన వంట నూనెల ధరలు..