ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుకుటుంబానికి రూ.పది వేలు.. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి వరద ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిరాశ్రయులైన కుటుంబాలకు 20 కిలోల చొప్పున బియ్యం..రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.కాలినడకన సాగుతూ.. భరోసా ఇస్తూ..వర్షంలోనే గోదావరి ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఏరియల్ సర్వేతోపాటు క్షేత్ర సందర్శన చేశారు. భద్రాచలం, రామన్నగూడెంలలో పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించారు. వరద కష్టాల శాశ్వత నివారణకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.సిరిసిల్లలో రాహుల్ సభ వాయిదా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆగస్టు2న నిర్వహించతలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని యోచిస్తోంది. భారీ వర్షాలతో రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సభ నిర్వహించడం సరికాదనే అభిప్రాయం ఆదివారం జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో వెల్లడైంది.రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధంరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాసనసభ కమిటీ హాల్లో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలతోపాటు ఏపీ శాసనసభ్యుడు మహీధర్‌రెడ్డి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ నేపథ్యంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.రైతు బిడ్డ ధన్‌ఖడ్‌కు మద్దతివ్వండి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌ఖడ్‌కు మద్దతు కూడగట్టేందుకు భాజపా ప్రయత్నాలు మొదలుపెట్టింది. రైతు బిడ్డ అయిన ధన్‌కడ్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విపక్షాలను కోరారు.దేశంలోనే యంగెస్ట్ సర్పంచ్.. దేశంలోనే అత్యంత చిన్నవయసులో సర్పంచ్‌గా ఎన్నికై మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ యాదవ్ రికార్డు సృష్టించారు. విదిశ జిల్లాకు చెందిన ఆయన.. ఆదివారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించారు. సరేఖో గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు అనిల్.బ్రిటన్ ఓటర్ల మద్దతు రిషి సునాక్వైపే.. బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్‌కే అక్కడి అధికార పార్టీ నేతలు జై కొడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మెజారిటీ ఓటర్లు రిషి సునాక్‌వైపు మొగ్గుచూపినట్లు తేలింది.'రూ.4 లక్షల కోట్ల వ్యవసాయ ఎగుమతులు.. దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి ఇటీవలి కొన్నేళ్లలో మెరుగుపడిందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. 2017-18తో పోలిస్తే 2021-22 లో రైతుల ఆదాయం సగటున 1.3 - 1.7 రెట్ల మేర పెరిగినట్లు వెల్లడించింది.పంత్, హార్దిక్ ధనాధన్ ఇన్నింగ్స్.. హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ ప్రదర్శనకు( 71, నాలుగు వికెట్లు) పంత్(125*) సెంచరీ తోడవ్వడం వల్ల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 2-1తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియా.. 42.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో ఫిజికల్ రిలేషన్.. హీరోయిన్ జాన్వీకపూర్, సారా అలీఖాన్ మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు ఇటీవలే సోషల్‌మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే ఇదే విషయమై మాట్లాడుతూ.. జాన్వీ తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సెక్స్‌లో పాల్గొందా లేదా అనేది తెలిపింది.