తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
టాప్​న్యూస్ @7AM

By

Published : Jul 20, 2022, 7:00 AM IST

  • బీటెక్‌ గరిష్ఠ రుసుము రూ.1.73 లక్షలు

రాష్ట్రంలో ఈసారి బీటెక్‌లో అత్యధిక రుసుము సీబీఐటీకి రూ.1.73 లక్షలుగా ఖరారైంది. అదే గ్రూపునకు చెందిన ఎంజీఐటీ ఫీజును రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడున్న ఫీజుపై గరిష్ఠంగా 18 శాతమే పెంచుతామని ప్రకటించిన టీఏఎఫ్‌ఆర్‌సీ కొన్నింటికి 40 శాతం వరకూ పెంచినట్లు తెలుస్తోంది.

  • ఔషధమే.. విషం.. వందలో మూడు నాణ్యతలేని మందులే

Counterfeit drugs: దేశంలో నాసిరకం, నకిలీ ఔషధాలు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. జీర్ణ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, బి విటమిన్‌, మూర్ఛ, వాంతులు తదితర జబ్బులకు ఉపయోగించే ముఖ్యమైన ఔషధాల్లోనూ నాణ్యతలేనివి సరఫరా అవుతుండడం ఆందోళన కలిగించే అంశం.

  • గోదావరి పరీవాహకంలో పల్లెలు ఆగమాగం

Flood Effect at Bhadrachalam: భద్రాద్రి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి భారీ నష్టాన్ని మిగిల్చింది. ముంపు ప్రాంతాల్లోని ఇళ్లన్ని మట్టిముద్దలుగా మిగిలాయి. ఆనవాళ్లు కోల్పోయి బురదతో నిండిన ఇళ్లను చూసి బోరుమంటున్నారు.

  • నేడు రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల బంద్‌!

Today Schools and Colleges Bandh: నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌ నిర్వహించనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఈ బంద్​కి పిలుపునిచ్చాయి.

  • తిరుగుబాటుకు బాటలు వేసిన 'పిగ్ రూపాయి'

తుపాకుల తూటాలకు పంది, ఆవు కొవ్వులను పూతగా పూయడం వల్ల సిపాయిలు తిరగబడ్డారు. అది క్రమంగా ప్రథమ స్వాతంత్య్ర సమరానికి దారితీసింది. దీంతో బ్రిటిష్‌ పాలకులు గడగడలాడారు. ఆ భయం ఇంకా వారి గుండెల్లో ఉండగానే అటువంటి సంఘటన 1911లో ఒకటి జరిగింది. అయితే ఈసారి వారు తప్పును వేగంగా దిద్దుకున్నారు. లేదంటే ప్రజల నుంచి మరో భారీ తిరుగుబాటును చవిచూడాల్సి వచ్చేది.

  • త్రివిధ దళాల్లో 1.35 లక్షల పోస్టులు ఖాళీ..

త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏటా సగటున భర్తీలు 60 వేలు, 5332, 5723గా ఉన్నట్లు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ వెల్లడించారు.

  • వాహన ఎగుమతుల్లో 26% వృద్ధి

Siam: ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌లో మన దేశం నుంచి 1,60,263 ప్రయాణికుల వాహనాలు ఎగుమతి అయ్యాయి. 2021 ఇదే త్రైమాసికంలో ఎగుమతి అయిన 1,27,083 వాహనాలతో పోలిస్తే ఈసారి 26 శాతం ఎక్కువగా జరిగాయని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) తెలిపింది.

  • ఐరోపాపై మళ్లీ కొవిడ్‌ పడగ..

COVID: ఐరోపాలో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. గత ఆరు వారాల వ్యవధిలో ఇక్కడ కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. ఆస్పత్రుల చేరికల్లో సైతం రెండు రెట్లు పెరుగుదల నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం ఈ వివరాలు వెల్లడించింది.

  • 8రోజుల్లో కామన్వెల్త్‌ పోటీలు.. అదరగొడతారా?

కామన్వెల్త్‌ క్రీడలు మరో ఎనిమిది రోజుల్లో మొదలు కాబోతున్నాయి. ఈ సారి పోటీల్లో కొన్ని కొత్త ఆటలు చేరిన నేపథ్యంలో భారత్​కు కూడా ప్రాతినిథ్యం పెరిగింది. దీంతో ఈ మెగా టోర్నీలో సత్తా చాటి పతకాలు సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఆటగాళ్లు.

  • అభిమానులకు షాక్​ ఇచ్చిన ప్రముఖ సింగర్​..

ప్రముఖ బాలీవుడ్ సింగర్​ అద్నాన్​ సమీ అభిమానులకు షాక్ ఇచ్చారు. సోషల్​మీడియా ఇన్​స్టా నుంచి తప్పుకున్నారు. తన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. 'అల్విదా' అని క్యాప్షన్​ జోడించారు. అయితే ఎందుకు ఇలా చేశారో చెప్పలేదు. ప్రస్తుతం ఈ విషయం హాట్​ టాపిక్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details