- గర్వకారణం
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుతో కరవు పీడిత ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం నీటితో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ట్వీట్ చేశారు. ఇంకా ఏం చెప్పారంటే..?
- వాసిరెడ్డి కన్నుమూత
అన్నదాత మాజీ సంపాదకుడు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు(93) కన్నుమూశారు. వాసిరెడ్డి నారాయణరావు అకాలమరణం పట్ల ఈనాడు గ్రూపు ఛైర్మన్ రామోజీరావు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం..
- అచ్చెన్నాయుడు అరెస్ట్
తెదేపా నేత, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏపీ అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..?
- చంద్రబాబు ఫైర్
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అనిశా అదుపులోకి తీసుకోవటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు.ఇంకా ఏం చెప్పారంటే..?
- 24 గంటల్లోనే...
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 10 వేల 956 మంది వైరస్ బారినపడ్డారు. మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల వివరాలు ఇలా...
- పాక్కు భారత్ దీటైన జవాబు..