తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు ముంబయి వెళ్లనున్న సీఎం కేసీఆర్​ - మహారాష్ట్ర సీఎం ఫడణవీస్​

ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎంను ఆహ్వానించేందుకు రేపు సీఎం కేసీఆర్​ ముంబయి వెళ్లనున్నారు. ఉదయం 10:20 గంటలకు హైదరాబాద్​ నుంచి ముంబయి బయలుదేరనున్నారు.

సీఎం కేసీఆర్​

By

Published : Jun 13, 2019, 10:03 PM IST

రేపు ముంబయి వెళ్లనున్న కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ముంబయి వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ను ఆహ్వానించనున్నారు. ఉదయం 10:20 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం నివాసంలో ఆయనతో సమావేశమవుతారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానిస్తారు.

ABOUT THE AUTHOR

...view details