ఉపాధిహామీ పథకం నిధులతో వీలైనన్ని ఎక్కువ శాఖల్లో పనులు చేపట్టాలని భావిస్తోన్న సీఎం కేసీఆర్.. అదే అంశం ప్రధాన అజెండాగా మంగళవారం కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రగతిభవన్ వేదికగా జరగనున్న కలెక్టర్ల సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీ, వ్యవసాయ అధికారులు కూడా హాజరు కానున్నారు.
రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం - సీఎం కేసీఆర్ తాజా వార్తలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశం కానున్నారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులు సహా ఇతర అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. సమావేశానికి స్థానికసంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు, జడ్పీసీఈవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, వ్యవసాయ అధికారులు కూడా హాజరుకావాలని ఆదేశించారు.
రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ
ప్రధానంగా ఉపాధి హామీ పనులు, వ్యవసాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఉపాధిహామీ నిధులతో కాల్వల పూడికతీత, మరమ్మతులు, కల్లాల నిర్మాణం, తదితర పనులు చేపట్టే విషయమై చర్చిస్తారు. కరోనా నివారణ చర్యలు, నియంత్రిత సాగు, హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి సహా ఇతర అంశాలపై కూడా కలెక్టర్ల సమావేశంలో చర్చ జరగనుంది.
ఇదీ చూడండి :నీటి గండం: అప్పడు నాగార్జునసాగర్.. ఇప్పుడు బస్వాపూర్
Last Updated : Jun 15, 2020, 9:08 AM IST