బడ్జెట్‌పై ఉభయసభల్లో ఇవాళ సాధారణ చర్చతోపాటు ప్రభుత్వ సమాధానం పూర్తి కానుంది. ఈనెల 18న ప్రవేశపెట్టిన వార్షికపద్దుపై 20న చర్చ ప్రారంభించారు. అన్ని పక్షాల సభ్యులు ఆ రోజు చర్చలో పాల్గొన్నారు. చర్చకు ఇవాళ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు.
బడ్జెట్‌పై ఉభయసభల్లో ఇవాళ సాధారణ చర్చ - Debate on budget in assembly
బడ్జెట్‌పై ఉభయసభల్లో ఇవాళ సాధారణ చర్చతోపాటు ప్రభుత్వ సమాధానం పూర్తి కానుంది. ఈనెల 18న ప్రవేశపెట్టిన వార్షికపద్దుపై 20న చర్చ ప్రారంభించారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆసరా పింఛన్లు, సౌర విద్యుత్, హరితహారం, ఉద్యోగులకు ఆరోగ్య పథకం, కేసీఆర్ కిట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు అంశాలు చర్చకు రానున్నాయి. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఉచిత తాగునీటి పథకం, భూముల డిజిటల్ సర్వే, గిరిజన గ్రామ పంచాయతీల్లో చౌకధర దుకాణాలు, రైతుబీమా పరిహారం చెల్లింపు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల వేతనాల పెంపు, రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
ఇదీ చూడండి :మళ్లీ కరోనా కలవరం.. పెరుగుతోన్న రోజువారీ బాధితులు