తెలంగాణ

telangana

ETV Bharat / state

Weather Report: అండమాన్‌లో మరో అల్పపీడనం... ఇవాళ, రేపు భారీ వర్షాలు - హైదరాబాద్‌ జిల్లా వార్తలు

రాష్ట్రంలో నేడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(rains latest news) కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం(hyderabad weather report) వెల్లడించింది. రేపు, ఎల్లుండి మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు (rains in telangana) కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

Weather Report
Weather Report

By

Published : Nov 13, 2021, 5:03 PM IST

రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(hyderabad weather report) ప్రకటించింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(rains latest news) పడతాయని తెలిపింది. ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని వాతావరణ శాఖ సంచాలకురాలు తెలిపారు. నిన్న ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు బలహీన పడిందని(latest weather report) పేర్కొన్నారు. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపారు.

దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం..

దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర థాయిలాండ్ తీర ప్రాంతాలలో మరో అల్పపీడనం ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఏర్పడిందని ప్రకటించారు. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని(latest weather report) తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 15న ఉత్తర అండమాన్ సముద్రం... దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం వుందని వివరించారు. తదుపరి ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 18న ఆంద్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం(hyderabad weather report) వెల్లడించింది

ఇదీ చదవండి:కేరళలో భారీ వర్షాలు- ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ABOUT THE AUTHOR

...view details