Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇద్దరు పార్టీ క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు జనసేన మీడియా విభాగం వెల్లడించింది. ఉదయం పది గంటలకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. 10.30 గంటలకు హైదరాబాద్‌లోని మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తాలో.. 11 గంటలకు ఎల్బీనగర్ అలకాపురి సెంటర్‌లో కొంత సమయం ఆగుతారు.
చౌటుప్పల్ మండలం లక్కారంలో ఇటీవల మరణించిన పార్టీ క్రియాశీల కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు పవన్ కల్యాణ్ పరామర్శించి రూ.5 లక్షల చెక్ అందజేస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు. రెండు గంటలకు కోదాడకు చేరుకుని ఇటీవల మరణించిన కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల చెక్ అందచేయనున్నారు.