రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. 2,216 మద్యం దుకాణాల ఏర్పాటుకు కొత్త లైసెన్సీల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అనుమతుల జారీ ప్రకియను 95శాతం వరకు పూర్తిచేశారు. మిగిలిన కొన్ని దుకాణాలకు ఒకట్రెండు రోజుల్లో లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. కొత్త మద్యం దుకాణాలు ఇవాళ్టి నుంచి ఏర్పాటు చేసుకోవాల్సి ఉండడం వల్ల లైసెన్సీలకు నిన్న రాత్రి నుంచి మద్యం సరఫరా చేసే ప్రక్రియ జరిగింది. రాత్రి పది గంటల నుంచి మొదలై రాత్రి అంతా మద్యం సరఫరా కొనసాగింది. రాష్ట్రంలోని 19 మద్యం డిపోలు రాత్రంతా ఇందుకోసం పని చేశాయి.
నేటి నుంచే విక్రయాలు ప్రారంభం