తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో జోరుగా నామినేషన్లు, ఇవాళ ముఖ్య నాయకుల్లో రేవంత్​, బండి సంజయ్

Today Naminations in Telangana State Wide : అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంది. పార్టీ బీ-ఫామ్‌ పొందిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓవైపు నామినేషన్లు వేస్తుండగా.. టిక్కెట్‌ దక్కని కొందరు ఆశావహులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తున్నారు.

Telangana Assembly Elections 2023
Today Naminations in Telangana

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 9:09 PM IST

Today Naminations in Telangana తెలంగాణలో జోరుగా నామినేషన్లు, ఇవాళ ముఖ్య నాయకుల్లో రేవంత్​, బండి సంజయ్, ఎర్రబెల్లి

Today Naminations in Telangana State Wide : శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో కొడంగల్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి... స్థానిక గుడిబావి శివాలయంలో శివుడికి అభిషేకం నిర్వహించారు.అనంతరం కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్​ను అందించారు. హైదరాబాద్ యాకుత్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా జాఫర్‌ హస్సేన్‌ మెహ్రాజ్‌.. సైదాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు.

కార్వాన్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ నామినేషన్ వేశారు. టోలిచౌకి వద్ద ఉన్న దర్గాలో ప్రార్థనల అనంతరం పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి లంగర్ హౌస్ రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎంసీపీఐకి చెందిన అనిల్‌కుమార్ భారీ ర్యాలీ(Anil Kumar Huge Rally)గా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరఫున ఆయన సతీమణి ముకుందమ్మ నామినేషన్ వేశారు.

Errabelli Dayakar Rao Nomination at Palakurthi Constituency: హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు నిర్వహించారు. బాల్గొండ బీఆర్​ఎస్​ అభ్యర్థిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి స్వగ్రామం వేల్పూర్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం భీంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందించారు. బోధన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా వడ్డి మోహన్ రెడ్డి(BJP Leader Vaddi Mohan Reddy Nomination) రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.

మొదటి రోజు సెంచరీ కొట్టిన నామినేషన్లు ఖాతా ఓపెన్​ చేయని బీఆర్ఎస్​

Congress Leaders Kasula BalarajuNomination : ఆర్మూర్‌ మాజీ మున్సిపల్ చైర్మన్ మేక గంగాధర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా శేఖర్ నాయక్ ఎన్నికల రిటర్నిoగ్ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాసుల బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించపోయినప్పటికీ.. తనకే టికెట్‌ వస్తుందని బాలరాజు ఆశాభవం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అలిగే ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు. మంథని నుంచి బీజేపీ అభ్యర్థిగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి నామినేషన్ వేశారు. భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్​ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావ్(BRS Leader Tellam Venkat Rao Nomination) ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

కరీంనగర్​లో నామినేషన్ వేసిన బండి సంజయ్, భారీ బైక్​ ర్యాలీతో హల్​చల్

నేడు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details