ఉద్యోగులకు పీఆర్సీ తదితర డిమాండ్లన్నింటిని పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr), మంత్రి వర్గ సభ్యులు, ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్జీవో (Tngo) కేంద్ర సంఘం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ అనేక సమస్యలను పరిష్కరిస్తోందని సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. దానిలో భాగంగానే 30% ఫిట్మెంట్ తో పీఆర్సీ జీవోలను విడుదలకు ఆదేశించడం... సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్న 9.5 లక్షల మంది ఉద్యోగులందరికీ మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి (Cm) ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.
Tngo: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవో
ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr)కు టీఎన్జీవో (Tngo) సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగులకు పీఆర్సీ తదితర డిమాండ్లన్నింటిని పరిష్కరించారని కొనియాడింది. చాలా మంది ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపింది.
tngo
ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినప్పటికీ టీఎన్జీవో (Tngo) సంఘం ఉద్యోగులను ఐక్యంగా ఉంచిందన్నారు. రాబోయే కాలంలో మరింత అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ... ముఖ్యమంత్రి కలలుగన్న బంగారు తెలంగాణ సాధనకు మరింత అంకితభావంతో పని చేస్తామని అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ హామీ ఇచ్చారు.