బతుకు దెరువు కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో... బతకడానకి నిత్యం పోరాటం చేయాల్సివస్తోందని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిగ్గుతేల్చేందుకు కాంగ్రెస్, సీపీఐ, తెజస, సీపీఐ ఎంఎల్ నేతలు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించామని కోదండరాం వెల్లడించారు.
'పోరాడి సాధించుకున్న తెలంగాణలో... బతకడానికి పోరాడాల్సివస్తోంది'
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోరాటం చేస్తే ప్రభుత్వం అణిచివేస్తుందని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్, ప్రభుత్వ వైఫల్యాలపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నివాసంలో అఖిలపక్షం నేతలు చర్చలు జరిపారు.
కరోనా నిర్మూలనకు సౌకర్యాలు కల్పించాలి... అసంఘటిత కార్మికులు, కుల, చేతి వృత్తుల వారికి నవంబర్ వరకు ఉచిత రేషన్తో పాటు నెలకు 7,500 పంపిణీ చేయాలి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుని సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి. ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన విరాళాలను ప్రజల ముందు పెట్టాలి. కరోనాను సాకుగా చూపిస్తూ ప్రజా ఆందోళనలపై ప్రభుత్వ నిర్బంధాన్ని అరికట్టాలి. డిమాండ్ల సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో వర్చువల్ రౌండ్ టేబుల్, వర్చువల్ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాబోయే పది రోజులు అఖిల పక్షం పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కార్యాచరణ చేపట్టింది. - ప్రొఫసర్. కోదండరాం, తెజస అధ్యక్షుడు.
ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలను ఏం చేస్తారంటే..