అమెజాన్ లాంటి ప్రఖ్యాత సంస్థ హైదరాబాద్‌ను క్లౌడ్ కంప్యూటింగ్ డెస్టినేషన్‌గా ఎంచుకోవటం ద్వారా.. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు క్యూ కడతాయని తెలంగాణ ఐటీ అసోసియేషన్ టీటా అభిప్రాయపడింది. అమెజాన్ విస్తరణ.. తెలంగాణ ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలా ఆశాబావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడులు పెట్టడంపై టీటా హర్షం - అమెజాన్ పెట్టుబడులపై టీటా వ్యాఖ్యలు హైదరాబాద్
హైదరాబాద్‌ను అమెజాన్ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ డెస్టినేషన్‌గా ఎంచుకోవడంపై తెలంగాణ ఐటీ అసోసియేషన్ టీటా హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు క్యూ కడతాయని అభిప్రాయపడింది. ఈ డాటా సెంటర్ల ద్వారా రాష్ట్రంలో డిజిటల్ ఎకానమీ బలపడటంతోపాటు.. ఐటీ సెక్టార్ వృద్ధికి దోహదం చేస్తుందని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలా ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడులు పెట్టడంపై టీటా హర్షం
ఈ డాటా సెంటర్ల ద్వారా రాష్ట్రంలో డిజిటల్ ఎకానమీ బలపడటంతోపాటు.. ఐటీ సెక్టార్ వృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల విస్తరణకు అమెజాన్ మరోసారి హైదరాబాద్‌ను ఎంచుకోవటానికి.. ఇక్కడి భౌగోళిక స్వభావం, ప్రభుత్వ అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులే కారణమని సందీప్ మక్తాలా పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు