తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. సోమవారం హుండీ ఆదాయం రూ.2 కోట్ల 93 లక్షలు దాటింది. ఇందులో చిల్లర పరకామణీనే రూ.85 లక్షలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరగుతుండటం.. అదే స్థాయిలో హుండీ ఆదాయం వస్తుంది.
పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయటం ప్రారంభించిన తితిదే.. మెుదట రోజుకు 3 వేల టోకెన్లు కేటాయించారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో మరో రెండు వేలు పెంచి మెుత్తం 5 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.