లాక్ డౌన్ కారణంగా.. ఉపాధిలేక ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ఖైరతాబాద్ లో పేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
ఖైరతాబాద్ లో ప్రతి రోజు మూడు వేల మందికి.. అన్నదానం.!
ఖైరతాబాద్ లో పేదలు, వలస కూలీలకు భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా.. ఉపాధిలేక ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
ఖైరతాబాద్ లో ప్రతి రోజు మూడు వేల మందికి.. అన్నదానం
ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో.. 150మంది పేదకుటుంబాలకు అన్నదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు.. నియోజకవర్గంలో ప్రతి రోజు మూడు వేల మందికి ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతేనే ప్రజలు రోడ్లపైకి రావాలని.. మాస్క్ విధిగా ధరించాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు