గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 16 కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన వికాస్ జాదవ్... కొంతకాలంగా జియాగూడ వెంకటేశ్వరనగర్‌లో నివసిస్తున్నాడు. తన అనుచరులు మణికంఠ, సతీశ్‌తో గంజాయి విక్రయిస్తున్నారు.
ముగ్గురు సభ్యుల గంజాయి ముఠా అరెస్ట్ - Telangana news
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16 కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు సభ్యుల గంజాయి ముఠా అరెస్ట్
ఈ ముఠా కిలో గంజాయిని రూ. 8 నుంచి 10 వేల వరకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వికాస్‌ను గంజాయి విక్రయం నిలిపివేయాలని పలుమార్లు పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా అతను మత్తు పదార్థాల అమ్మకాలను నిలిపివేయకుండా ముఠా ఏర్పాటు చేసి మరీ కొనసాగిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ముఠాకు చెందిన సత్య విష్ణు, ఆనంద్ పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.