గాంధీనగర్‌లో బాలికపై ముగ్గురు బాలురు బ్లేడ్‌తో దాడి హైదరాబాద్ గాంధీనగర్‌లో ఉదయం ఓ దారుణం జరిగింది. స్థానిక దోమల్‌గూడలో ఉంటున్న బాలికను ముగ్గురు బాలురు... లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గల డీబీఆర్ మిల్స్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గంజాయి ఇచ్చారు.అనంతరం బాలికనువివస్త్రను చేసి, బ్లేడుతో తీవ్రంగా గాయపరిచారు. ఆ ఉదంతాన్ని చరవాణిలో చిత్రీకరించి రాక్షసానందం పొందారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించి, దాడి చేసిన వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులేమంటున్నారు..
ఈ కేసులో పోలీసుల కథనం మరోలా ఉంది. బషీర్‌బాగ్‌కు చెందిన బాలుడు, దోమల్‌గూడకు చెందిన ఓ బాలిక మూడు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆ బాలిక తనతో కాకుండా వేరొకరితో చనువుగా ఉంటోందని తెలుసుకున్నాడు. ఆమెపై పగ పెంచుకుని డీబీఆర్ మిల్స్‌కు తీసుకెళ్లి.. లైంగికంగా వేధించి బ్లేడుతో దాడి చేశాడని చెబుతున్నారు. గురువారం రాత్రి ఈ ఘటన జరగగా శుక్రవారం ఉదయంతమ దృష్టికి వచ్చిందన్నారు. దాడి సమయంలో చిత్రీకరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని చిక్కడపల్లి ఏసీపీ వై.నర్సింహారెడ్డి తెలిపారు.
ప్రస్తుతం బాలుడ్ని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. అతనిపై పలు క్రిమినల్ చట్టాలతో పాటు, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీపీ చెప్పారు.
ఈ వీడియోను అంతర్జాలంలో పెట్టిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:బాలికపై ఉన్మాదుల ఘాతుకం