తెలంగాణ

telangana

ETV Bharat / state

'దాతలు ముందుకొచ్చి నా బిడ్డను ఆదుకోండి' - need medical help

మంచాన ఉండి మృత్యువుతో పోరాడుతున్న కన్న కుమారుడి వైద్య ఖర్చుల కోసం ఓ తల్లి సాయం అడుగుతోంది. దాతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు సహకరిస్తే ప్రాణాలు నిలబడే అవకాశాలు ఉన్నాయని తల్లి వేడుకుంటుంది.

this-25-years-old-youngman-need-medical-help
'దాతలు ముందుకొచ్చి నా బిడ్డను ఆదుకోండి'

By

Published : Jun 24, 2020, 1:49 PM IST

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కొట్టాల గ్రామం విఆర్ఏ బాలకృష్ణ (25) మంచం పట్టి మృత్యువుతో పోరాడుతున్నాడు. ఎన్నికల సమయంలో డివిజన్, జిల్లా కేంద్రాల్లో పని చేసి... లివర్ చెడిపోయి అనారోగ్యానికి గురైయ్యాడు. ఇతర అవయవాలు కొన్ని పాడైపోవడంతో రూ.40 లక్షలు ఖర్చయ్యే వైద్యం చేయించుకోలేక మంచంపైనే నిస్సహాయంగా ఉన్నాడు.

తన కుమారుడికి సాయం చేయాలని తల్లి వేడుకుంటోంది. బాధితుని తండ్రి వెంకయ్య గ్రామ వీఆర్ఏగా పని చేస్తూ గతంలో మరణించాడు. తల్లి భాగ్యమ్మను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న బాలకృష్ణను అనారోగ్యం వెంటాడింది. దాతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు సహకరిస్తే ప్రాణాలు నిలబడే అవకాశాలు ఉన్నాయని తల్లి భాగ్యమ్మ, స్థానికులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details