గుంటూరులో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం - ఏపీ తాజా వార్తలు
ఏపీలోని గుంటూరులో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
గుంటూరులో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో కొవిడ్ టీకా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి లాంఛనంగా ప్రారంభించారు. మూడో దశ క్లినికల్ పరీక్షల్లో వెయ్యి మందికి టీకాలు ఇవ్వనున్నారు.
TAGGED:
covaxin clinical trials