ఈ నెల 4న హైదరాబాద్ అప్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారిని కత్తులతో బెదిరించి 3 లక్షల 30 వేల రూపాయలు దోచేశారు. ఈ కేసును పోలీసులు ఛేందించారు. నిందితుల నుంచి 2 లక్షల 65 వేల నగదు, రెండు కత్తులు, 10 చరవాణులు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సయ్యద్ పాషా, ఫయాజ్ ఇమ్రాన్, అమీర్ ఖాన్, ఖదీర్, వసీంలను నిందితులుగా గుర్తించారు.
కత్తులతో బెదిరించి లక్షలు దోచుకెళ్లారు.. చివరికి చిక్కారు
హైదరాబాద్ అప్జల్‌గంజ్ పరిధిలో ఈ నెల 4 న కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా... మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2 లక్షల 65 వేల నగదు, రెండు కత్తులు, 10 చరవాణులు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
theft gang arrested in hydertabad
ఈ నెల 4న సదరు వ్యాపారి దుకాణం నుంచి బయటకు వచ్చే క్రమంలో రెక్కీ నిర్వహించి స్క్రూడైవర్‌తో దాడి చేశారు. కత్తులతో బెదిరించి చేతిలో ఉన్న డబ్బు సంచిని లాక్కెళ్లారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.