తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ వారంలో భారత్​బయోటెక్ నాసల్‌ వ్యాక్సిన్‌పై మూడోదశ క్లినికల్‌ పరీక్షలు

Bharat Biotech Nasal Vaccine: భారత్​బయోటెక్ నాసల్‌ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయి. ఎయిమ్స్‌ సహా 9 ప్రదేశాల్లో ఈ పరీక్షలు చేపట్టేందుకు భారత్‌ బయోటెక్‌ వర్గాలు రంగం సిద్ధం చేసింది.

The third phase of clinical trials on the Bharat Biotech nasal vaccine is scheduled for this week
నాసల్‌ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు

By

Published : Mar 9, 2022, 7:20 AM IST

Bharat Biotech Nasal Vaccine: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న చుక్కల మందు టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. దిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) సహా దేశవ్యాప్తంగా 9 ప్రదేశాల్లో ఈ పరీక్షలు చేపట్టేందుకు భారత్‌ బయోటెక్‌ వర్గాలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5,000 మంది వాలంటీర్లు ఇందులో భాగస్వాములు అవుతారని అంచనా. ఈ పరీక్షలకు భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి వచ్చిన విషయం విదితమే.

ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి బూస్టర్‌ డోసు కింద చుక్కల మందు టీకా ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశాన్ని కూడా మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. ఈ టీకా ఇవ్వడంలో ఉన్న ప్రయోజనాలు, రవాణా, నిల్వ సులువు కావడం వల్ల చుక్కల మందు టీకా కోసం వివిధ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

కొవిడ్‌-19పై పోరాటంలో ఈ టీకా అత్యంత క్రియాశీలకంగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. బీబీవి154 గా వ్యవహరిస్తున్న ఈ చుక్కల మందు టీకాను అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో కుదిరిన లైసెన్సింగ్‌ ఒప్పందం ప్రకారం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసింది.

ఇదీ చూడండి: అంకురం నుంచి ప్రపంచ సంస్థగా... భారత్‌బయోటెక్‌ విజయంలో సుచిత్ర ఎల్ల పాత్ర

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details