తెలంగాణ

telangana

ETV Bharat / state

28 వరకు అసెంబ్లీ సమావేశాలు... బీఏసీ నిర్ణయం - తెలంగాణ తాజా వార్తలు

ఈనెల 28 వరకు 18 పనిదినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. సమావేశాల పనిదినాల విషయమై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీలో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీసీఏ నిర్ణయం
ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీసీఏ నిర్ణయం

By

Published : Sep 7, 2020, 7:05 PM IST

అసెంబ్లీ సమావేశాల పనిదినాల విషయమై సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి అధ్యక్షతన బీఏసీ నిర్వహించారు. ఈనెల 28 వరకు 18 పనిదినాలు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం శాసనసభకు సెలవు ఉంటుంది. గంటపాటు ప్రశ్నోత్తర సమయానికి కేటాయించారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో ఆరు ప్రశ్నలకే అనుమతి ఇవ్వాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అరగంట పాటు జీరో అవర్ ఉంటుంది.

ఈనెల 28న బీఏసీ మరోసారి సమావేశం కానుంది. మంగళవారం పీవీ శత జయంతి ఉత్సవాలపై చర్చ, తీర్మానాలు చేయనున్నారు. ఈనెల 9న కరోనాపై చర్చ జరగనుంది. అదే రోజు రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈనెల 10, 11న కొత్త రెవెన్యూ బిల్లు చట్టంపై చర్చించనున్నారు. బిల్లుల ఆమోదం కోసం సాయంత్రం సమావేశాలను నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details