అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చుతున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి 300 సిమ్‌కార్డులు, 20 సిమ్ బాక్సులు, వైఫై రుటర్లు, యూపీఎస్ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఏం జరిగిందంటే?
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని ఇస్మాయిల్ నగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇమ్రాన్ అతని భార్య రేష్మ సుల్తానా ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. వీరికి అవసరమైన సిమ్‌కార్డులు కామారెడ్డి జిల్లా పల్కమ్ పేటలోని కిరాణ దుకాణం నిర్వాహకులు వాహిద్, అహ్మద్ సరఫరా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ భార్య రేష్మ సుల్తానా, వాహిద్, అహ్మద్, సిమ్‌కార్డు పంపిణీ దారుడు అబ్దుల్ నవీద్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇమ్రాన్ కోసం గాలిస్తున్నారు.
ఐఎస్డీ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చుతున్న కేంద్రంపై దాడి ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్