తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆన్​లైన్​ షాపింగ్​లో ఆర్డర్‌ తీసుకున్న సంస్థదే బాధ్యత' - హైదరాబాద్ తాజా వార్తలు

Consumer Commission: కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగితే దానికి పూర్తి బాధ్యత ఆర్డర్‌ తీసుకున్న వారిపైనే ఉంటుందని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తెలిపింది. ఓవ్యక్తి ఆన్‌లైన్‌లో షాపర్స్‌ స్టాప్‌ వెబ్‌సైట్‌లో బంగారు నాణేన్ని కొనుగోలు చేశాడు. అది సక్రమంగా అందజేయకపోవడంతో అతను వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్​ ఫిర్యాదుదారుడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. .

వినియోగదారుల కమిషన్‌
వినియోగదారుల కమిషన్‌

By

Published : Jun 25, 2022, 8:51 AM IST

Updated : Jun 25, 2022, 10:25 AM IST

Consumer Commission: కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగితే దానికి పూర్తి బాధ్యత ఆర్డర్‌ తీసుకున్న వారిపైనే ఉంటుందని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బంగారు నాణేన్ని సక్రమంగా అందజేయనందున దాని ఖరీదు రూ.1.53 లక్షలు, 18 శాతం వడ్డీ, పరిహారంగా రూ.50 వేలు, ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని షాపర్స్‌ స్టాప్‌ లిమిటెడ్‌ను ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పరకాలకు చెందిన రవిచంద్ర 2016లో షాపర్స్‌ స్టాప్‌ వెబ్‌సైట్‌లో మలబార్‌ కంపెనీకి చెందిన 50 గ్రాముల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఆ ఆన్‌లైన్‌ కొనుగోలుపై అందిన పార్సిల్‌లో కేవలం బిల్లు తప్ప నాణెం లేకపోవడంతో షాపర్స్‌ స్టాప్‌ వారికి ఫిర్యాదు చేయడంతో పాటు, పార్శిల్‌ విప్పినప్పుడు తీసిన వీడియోను కూడా పంపారు. సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రవిచంద్ర జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా, ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

దీన్ని సవాలు చేస్తూ షాపర్స్‌ స్టాప్‌ లిమిటెడ్‌ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు చేసింది. ఫిర్యాదుదారుడు పార్సిల్‌లో నాణెం తీసుకుని తిరిగి సీలు వేశారని, మలబార్‌ కంపెనీని, కొరియర్‌ సర్వీసులను ప్రతివాదులుగా చేర్చలేమని పేర్కొంది. కొనుగోలుదారు నుంచి ఆర్డర్‌ తీసుకుని కంపెనీకి పంపడం మినహా తమ పాత్ర లేదని పేర్కొంది. అప్పీలుపై విచారించిన కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, సభ్యురాలు మీనా రామనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. నిబంధనల ప్రకారం నాణేన్ని ప్యాకింగ్‌ చేసినపుడు వీడియో చిత్రీకరించాలని.. కానీ దానికి సంబంధించిన వీడియోను షాపర్స్‌ స్టాప్‌ సమర్పించలేదంది.

Last Updated : Jun 25, 2022, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details