విదేశీ పక్షుల సంతానోత్పత్తి కాలమిది. అందులో భాగంగానే రివర్ టెర్న్ పక్షులు హైదరాబాద్ శివార్లలోని గండిపేట జలాశయానికి వలసవచ్చాయి. సంతానాన్ని వృద్ధి చేసుకున్నాయి. అందులో ఒక పక్షి పిల్ల మంగళవారం ఒడ్డునే చిన్న చేపల కోసం వెదుకుతూ బురదలో కూరుకుపోయింది.
గద్దనైనా ఎదిరిస్తాం.. బిడ్డను కాపాడుకుంటాం! - eagle
మనుషులై కాదు... పక్షులు సైతం.. పిల్లల జోలికి వస్తే మాత్రం పోరాటానికైన సిద్ధపడుతాయి. ఓ పక్షి పిల్లను ఓ గద్ద ఎత్తుకెళ్లడానికి రాగా... దానిని ఆ జాతి పక్షులన్నీ కలిసి అడ్డుకున్నాయి. ఈ దృశ్యాలను ఈటీవీభారత్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

గద్దనైనా ఎదిరిస్తాం.. బిడ్డను కాపాడుకుంటాం!
ఇదే అదునుగా గద్ద ఒకటి దాన్ని ఎత్తుకెళ్లేందుకు రాగా, ఆ జాతి పక్షులన్నీ ఆ ప్రయత్నాన్ని కలిసికట్టుగా అడ్డుకున్నాయి. వాటి పరిమాణం, శక్తి తక్కువే అయినప్పటికీ మూకుమ్మడిగా గద్దపై దాడిచేసి, అక్కణ్నుంచి దూరంగా తరిమేశాయి. ‘ఐకమత్యమే మహా బలం’ అని నిరూపించాయి.
ఇదీ చదవండిఃదిశ తరహా ఘటనపై ఎన్నెన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు..