రాష్ట్రంలో 2018 ఏడాది ఆడపిల్లల జననాలతో పోలిస్తే.. మగపిల్లల జననాలు 8.29% ఎక్కువగా ఉన్నాయి. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో 67% అధిక ప్రసవాలు జరిగాయి. జననాలు 100% నమోదవుతుండగా, మరణాల నమోదు 58.2 శాతానికే పరిమితమైంది. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో జననాలు 89.3%, మరణాలు 100% నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 924 మంది మహిళలు ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలో 20వ స్థానంలో నిలిచింది.
తెలంగాణ జనాభా 3 కోట్ల 72 లక్షల 10వేలు..
తెలంగాణ రాష్ట్ర జనాభా 2018 మధ్య నాటికి 3,72,10,000కి చేరింది. కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా ‘2018 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ గణాంకాలను విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ జనాభా 3 కోట్ల 72 లక్షల 10వేలు..
తెలంగాణలో 2018లో 6,28,842 జననాలు సంభవిస్తాయని అంచనా వేయగా 6,52,791; 2,34,420 మరణాలు సంభవిస్తాయని అంచనా వేయగా 1,36,528 నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అంచనాలకంటే తక్కువ జననాలు, ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో 2014లో 95.6% జననాలు నమోదు కాగా.. 2018 నాటికి అది 100%కి చేరింది. ఇదే సమయంలో మరణాల నమోదు 76.7% నుంచి 58.2%కి తగ్గిపోయింది.