తెలంగాణ

telangana

ETV Bharat / state

క్షణికావేశంతోనే హత్య : పోలీసులు

హైదరాబాద్ ఖైరతాబాద్​లో ఈ నెల 18న జరిగిన హత్య కేసును సైఫాబాద్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ, క్షణికావేశం వల్లే ఈ హత్య జరిగిందని సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

By

Published : Aug 20, 2019, 7:49 PM IST

ఏసీపీ

ఈనెల 17న ఖైరతాబాద్ చింతల్​బస్తీకి చెందిన నెనావత్ బంగారికి, నెహ్రూనగర్​కి చెందిన ప్రకాశ్​ రాజ్​కు మధ్య గొడవ జరిగింది. రద్దీ ప్రాంతంలో బంగారి, ప్రకాశ్​ను​ నెట్టుకుంటూ పోయాడనే చిన్న విషయానికి ఇద్దరు మధ్య వాగ్వివాదం పెరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రకాశ్​.. బంగారి మీద కోపం పెంచుకున్నాడు. అదే రోజు బంగారి భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికి వచ్చి సధన్ కాలేజ్ ఎదురుగా ఉన్న డివైడర్​పై పడుకున్నాడు. ఇది గమనించిన ప్రకాశ్ అనంతరం​ బంగారి తలపై బండరాయితో దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు.

సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా

తెల్లవారుజామున జీహెచ్ఎంసీ సిబ్బంది బంగారి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసుల బృదం దర్యాప్తు చేసి... సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడు ప్రకాశ్​ రాజ్​ను బోరాబండలోని అతని బంధువుల ఇంట్లో అరెస్ట్ చేశారు.

క్షణికావేశంతోనే హత్య జరిగింది: పోలీసులు

ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details