హైదరాబాద్ గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో బక్రీద్ నాడు జరిగిన సమీరా బేగం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె భర్త మహమ్మద్ బషీర్ అహ్మద్ గొడ్డలితో నరికి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. పోలీసు బృందాలు నిందితుడిని ఈ రోజు ఉదయం 8గంటలకు టోలిచౌకి వద్ద అదుపులోకి తీసుకున్నాయి. వరకట్నం తేవాలంటూ సమీరాను రోజూ హింసించేవాడని అదే కాకుండా సమీరాపై తనకు అనుమానం ఉందని పోలీసుల దర్యాప్తులో బషీర్ అహ్మద్ తెలిపాడు. ఈ అనుమానం కారణంగానే తన భార్యను హతమార్చినట్లు చెప్పాడని వివరించారు.
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు - acp
భార్య చెల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కట్నం తేవాలని వేధించాడు. అనుమానంతో హింసించాడు. చివరికి అంతమోందించాడు భర్త మహమ్మద్ బషీర్ అహ్మద్. బక్రీద్ నాడు జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
నిందితుడు