గద్వాల్ జిల్లా రాజోలి గ్రామానికి చెందిన ఎన్.డి.మోహన్ కూకట్‌పల్లిలోని మాధవినగర్లో నివాసం ఉంటూ, హైదరాబాదీ బావర్చి రెస్టారెంట్ నడుపుతున్నాడు. కాలక్షేపం కోసం తన స్నేహితులతో కలిసి పఠాన్‌చెరులోని పద్మనాభస్వామి ఆలయానికి కారులో బయలుదేరి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామ దగ్గరలోని కర్దనూర్ వద్ద వీరి కారు ఓ ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టటంతో, వాహానం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మోహన్ సంఘటన స్థలం నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చాడు. తన నేరం బయటపడుతుందనే భయంతో మోహన్ తానుంటున్న భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఆత్మహత్య - Suicide
నిన్న నందిగామ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు... అందుకు కారణమైన మోహన్ అనే వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఆత్మహత్య