హైదరాబాద్లో 4రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారుల పై గుంతలు ఏర్పడ్డాయి. వాటికి జీఎహెచ్ఎంసీ మరమ్మతులు చేపట్టింది. ఈ పనులు ఏవిధంగా జరుగుతున్నాయో మేయర్ బొంతు రామ్మోహన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అమీర్ పేట్, ఖైరతాబాద్, బల్కంపేట్ తదితర ప్రాంతాల్లో వివిధ బృందాలు చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లో మేయర్ ఆకస్మిక తనిఖీలు - జీఎహెచ్ఎంసీ అధికారులు
గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లుకు..జీఎహెచ్ఎంసీ పునరుద్ధరణ చర్యలు చేపట్టంది. వివిధ బృందాలు ఏవిధంగా పనిచేస్తున్నాయో మేయర్ బొంతు రామ్మోహన్ పలు ప్రాంతాల్లో తిరిగి పరిశీలించారు.
ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మేయర్