విద్యుత్ స్తంభాల పనులను పూర్తి చేయాలని డిస్కం అధికారులకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దర్గా, గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్, మజీద్ బండ తదితర ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. జేఆర్‌సీ చౌరస్తా, గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్‌కు పోయే ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ది చేసి ట్రాఫిక్‌ను మళ్లించాలని తెలిపారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అనంతరం చందానగర్ సర్కిల్లో శిల్పారామం వద్ద రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ఫ్రీ ఫుడ్ వెండింగ్ జోన్‌ను మేయర్ ప్రారంభించారు. ఆధునిక పద్ధతిలో పర్యావరణ హితంగా వీధి వ్యాపారుల కోసం జీహెచ్‌ఎంసీ ఈఫుడ్ వెండింగ్ జోన్‌ను నెలకొల్పింది. ఈజోన్‌లో 50 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్ సదుపాయాన్నికల్పించింది.