జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఈనెల 8కి వాయిదా పడింది. శుక్రవారం వరకు పలువురు సాక్ష్యులను సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission)విచారించింది. నేటి నుంచి ఈనెల 7 వరకు దీపావళి సందర్భంగా సెలవులు ప్రకటించింది. 8న విచారణ పునః ప్రారంభం కానుంది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై 2019 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission)ను ఏర్పాటు చేసింది. ఎన్కౌంటర్పై విచారణ జరిపి ఆర్నెళ్లలో నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ... కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission).. సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఈ మేరకు కమిషన్ విచారణను వేగంగా కొనసాగిస్తోంది.
Sirpurkar Commission: జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణకు విరామం.. ఎందుకంటే! - Justice Sirpurkar Commission
దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) విచారణ వాయిదా పడింది. నేటి నుంచి ఈనెల 7 వరకు దీపావళి సందర్భంగా సెలవులు ప్రకటించింది.
హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో ప్రారంభమైన విచారణ... సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డి, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, మృతుల కుటుంబ సభ్యులు, ఎన్హెచ్ఆర్సీ సభ్యులు, అఫిడవిట్ దాఖలు చేసిన మానవ హక్కుల సంఘాలతో పాటు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను కూడా కమిషన్ (Sirpurkar Commission)విచారించింది. దిశ హత్యాచారం మొదలుకొని, ఎన్కౌంటర్, పోస్టుమార్టం వరకు పలు అంశాలపై సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) సాక్ష్యులను ప్రశ్నించింది. 8న మరోసారి ప్రారంభమయ్యే విచారణలో కమిషన్ సభ్యులు మరికొంత మంది పోలీస్ అధికారులను ప్రశ్నించనుంది.
ఇదీ చూడండి:SIRPURKAR COMMISSION:సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నల వర్షం..హైకోర్టును ఆశ్రయించిన ఏసీపీ