తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైకోర్టు సూచనల అమలుకు విధాన నిర్ణయం అవసరం' - తెలంగాణ హైకోర్టు వార్తలు

హైకోర్టు సూచనలకు అనుగుణంగా వృద్ధాశ్రమాలకు అనుబంధంగా బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు విధాన నిర్ణయం అవసరమని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వృద్ధాశ్రమాల్లో అధ్వాన పరిస్థితులపై రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నివేదిక దాఖలు చేసింది. ్​

The implementation of the High Court instructions requires a policy decision
హైకోర్టు సూచనల అమలుకు విధాన నిర్ణయం అవసరం

By

Published : Jun 27, 2020, 5:00 AM IST

వృద్ధాశ్రమాలకు అనుబంధంగా బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయడానికి విధాన నిర్ణయం అవసరమని ప్రభుత్వం.. హైకోర్టుకు నివేదించింది. రెండింటినీ ఒకేచోట ఏర్పాటు చేయడానికి అవసరమైన వసతి సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

హైదరాబాద్​లో ప్రయోగాత్మకంగా..

హైదరాబాద్​లో ప్రయోగాత్మకంగా బాలల అనాథాశ్రమం పిల్లలతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. బాల్యంలోనే చిన్నారులకు మార్గదర్శనం చేసేందుకు పెద్దల అండ అవసరమని వివరించింది. తోడులేక వృద్ధాశ్రమాల్లో ఉన్న పెద్దలను, పిల్లలను ఒకేచోట ఉంచే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలో భాగంగా ఈ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

హెల్ప్​లైన్​ ఏర్పాటు..

వృద్ధాశ్రమాల్లో అధ్వాన పరిస్థితులపై రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నివేదిక దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య నివేదిక దాఖలు చేశారు. వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి అసౌకర్యం కలిగితే ఫిర్యాదు చేయడానికి వీలుగా అన్ని పోలీస్​ స్టేషన్లలో 14567 హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు. ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ నగర కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

వృద్ధాశ్రమాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్​సైట్ ఏర్పాటుచేశామని కోర్టుకు నివేదించారు. ఇందులో జిల్లా సంక్షేమాధికారులు, బాలల అభివృద్ధి - రక్షణాధికారులు, పరిశీలకుల తనిఖీల గురించి కనీస సమాచారం ఉంటుందన్నారు. ఈనెల 30 నుంచి ఆన్​లైన్​లో వృద్ధాశ్రమాల రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉందన్నారు. పోలీస్​ స్టేషన్ పరిధిలోని అన్ని వృద్ధాశ్రమాలపై సర్వే నిర్వహించి జాబితా అందించాలని డీజీపీకి లేఖ రాశామన్నారు. వృద్ధాశ్రమాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా సంక్షేమాధికారులు, శిశుసంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్​లకు ఆదేశాలు జారీచేశామని ధర్మాసనానికి నివేదించారు.

ఇదీ చదవండి:ముసలోళ్లపై కాఠిన్యం... బతికుండగానే చంపేసిన యంత్రాంగం!

ABOUT THE AUTHOR

...view details