తెలంగాణ

telangana

ETV Bharat / state

ముమ్మరంగా సాగుతోన్న ఫీవర్ సర్వే - ఇంటింటి ఫీవర్ సర్వే

జ్వర బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే వేగవంతమైంది. వైద్య బృందాలు.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇల్లిల్లూ తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నాయి. కేసులు ఎక్కువగా నమోదవుతోన్న ప్రాంతాల్లో.. జీహెచ్ఎంసీ అధికారులు యాంటి లార్వా ద్రావనాన్ని పిచికారి చేయిస్తున్నారు.

fever survey in ghmc
జీహెచ్‌ఎంసీలో ఫీవర్ సర్వే

By

Published : May 16, 2021, 7:54 PM IST

జీహెచ్ఎంసీలో.. కొవిడ్ నియంత్రణలో భాగంగా చేపట్టిన ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగుతోంది. 1563 వైద్య బృందాలు.. ఇవాళ ఇంటింటికి తిరిగి సర్వే జరిపాయి. జ్వరంతో బాధ పడుతోన్నవారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తున్నాయి. ఆ సమాచారం మేరకు.. కేసులు ఎక్కువగా నమోదవుతోన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు యాంటి లార్వా ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నారు.

ఓ ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, జీహెచ్ఎంసీ వర్కర్లు.. ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 8,38,970 ఇళ్లలో సర్వే నిర్వహించారు. బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 1,93,900 మందికి ఫీవర్​ టెస్ట్​లు జరిపారు. బాధితులందరికి కరోనా కిట్లను అందించి.. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 3,816 కరోనా కేసులు... 27 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details