కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రొటేషన్ విధానంలో విధులు నిర్వర్తించే అవకాశం కల్పించింది. అత్యవసర సేవలు ఉండే శాఖలు, కార్యాలయాలు మినహా మిగతా చోట్ల రొటేషన్ విధానంలో 20 శాతం ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారుల వరకు దీన్ని అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. అయితే ఈ సమయంలో కార్యాలయాలకు రాని ఉద్యోగులు హెడ్క్వార్టర్స్లోోనే అందుబాటులో ఉండాలని, ఎలక్ట్రానిక్, సమాచార వ్యవస్థతో ఎల్లప్పడూ అనుసంధానమై ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఉద్యోగులకు రోటేషన్ విధానం అమలు - లాక్డౌన్
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రొటేషన్ విధానంలో విధులకు హాజరయ్యేలా సర్కారు వెసులుబాటు కల్పింది. విధులకు రాని ఉద్యోగులు కార్యాలయాల హెచ్క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసింది.
ఉద్యోగులకు రోటేషన్ విధానం అమలు