కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి అదృశ్యమైన ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అదృశ్యమైన వ్యక్తి పాల్‌కు నాలుగేళ్ల కింద మారియాతో వివాహం అయింది. వీరికి ఒక పాప ఉన్నది. మారియా ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. పాల్ తన కూతురితో తిరుమలగిరిలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. పాల్ తిరుమలగిరి ఎంక్లేవ్‌లో కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. నిన్న అతని కూతురు వద్దకు వచ్చి రెండు వేల రూపాయలు ఇవ్వగా అతని మామ వద్దని వారించారు.. ఆ కారణంతోనే అతను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల కల్లా ఇంటికి వచ్చే పాల్ రాకపోయే సరికి పాల్ మామ వినిసెంట్ ఆఫీస్‌కు ఫోను చేశాడు. అతను అక్కడి నుంచి ఐదు గంటలకే బయలు దేరాడని ఆఫీస్ వారు చెప్పారు. అతని స్నేహితులకు బంధువులకు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతటా వెతికినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే తిరుమలగిరి పోలీసులకు వినిసెంట్ సమాచారం ఇవ్వడం వల్ల వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అదృశ్యమైన కారు డ్రైవర్ - secendrabad
తిరుమలగిరికి చెందిన ఓ కారు డ్రైవర్ అదృశ్యమయ్యాడు. కుటంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు.
అదృశ్యమైన కారు డ్రైవర్