TSPSC CASE Investigation: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకేజ్ కేసు విషయంలో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, రాజేశ్వర్లను సిట్ అధికారులు కస్టడీ విచారణ ముగిసింది. మూడు రోజుల కస్టడీలో భాగంగా నలుగురిని విచారించిన పోలీసులు కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితులకు ఏప్రిల్ 11 వరకూ 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించగా వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు కమిషన ఉద్యోగులైన షమీమ్, రమేష్, సురేష్ లను పోలీసులు 7రోజులు కస్టడీకి కోరగా.. కోర్టు వారిని 5రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని రేపు కస్టడీకి తీసుకుని హమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారించనున్నారు. ఈ కేసులో మరో ముగ్గురికి ఐదు రోజుల కస్టడీ విధించింది కోర్టు. నాంపల్లి ధర్మాసనం సురేశ్, రమేశ్, షమీమ్‌ను కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి ముగ్గురికి 5 రోజుల పాటు కస్టడీలో ఉండనున్నారు.
బీజేవైఎం నేతలకు బెయిల్:ప్రశ్న పత్రం లీక్ అవ్వడంతోన ఈ నెల 14న బీజేవైఎం నేతలు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితులు గందరగోళంగా మారినందున పలువురు బీజేఎం నాయకులను, కార్యకర్తలు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అందులో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ కూడా ఉన్నారు. వీరికి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసి.. కొన్ని షరతులను పెట్టింది.
నాంపల్లి కోర్టు విధించిన షరతులు ఏమిటంటే:
- ప్రతి 3వ ఆదివారం బేగంబజార్ పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.
- అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతులు విధించింది.