హైదర్‌గూడకు చెందిన న్యాయవాది నిసరుద్దీన్ అహ్మద్ జెడ్డీ ఛాతీలో కండరాల నొప్పితో 2014 ఫిబ్రవరి 15న హైదరాబాద్ నర్సింగ్‌హోంలోని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.సునీల్‌కపూర్‌ను సంప్రదించారు. ఈసీజీ, 2డి ఎకో వంటి రోగనిర్ధారణ పరీక్షలు చేయకుండానే ఆయన ‘గుండెకు రక్త సరఫరా సక్రమంగా అందడం లేదు’ అని నిర్ధారణకు వచ్చి మందులు రాసిచ్చారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆ వైద్యుడు మరి కొన్ని రకాల మందులు రాసిచ్చారు. ఫలితం లేకపోవడంతో మరోసారి పరిశీలనకు వెళ్లగా.. ఆరోగ్య బీమా పాలసీ కార్డు తీసుకురావాలని, బైపాస్ శస్త్రచికిత్స గురించి చర్చిద్దామని సూచించడంతో ఫిర్యాదీ అవాక్కయ్యారు.
పరిశీలించకుండానే గుండె జబ్బని నిర్ధారణ.. ఆ తర్వాత ఏమైందంటే? - పరిశీలించకుండానే గుండె జబ్బని నిర్ధారణ
ఛాతీ నొప్పి అని వచ్చిన ఓ వ్యక్తిని పరిశీలించకుండా, వైద్య పరీక్షలు చేయకుండానే గుండె సంబంధిత వ్యాధి అని నిర్ధారించి మందులు ఇచ్చిన ఓ ఆసుపత్రి, అందులోని వైద్యుణ్ని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 మందలించింది. బాధితుడికి రూ.3 లక్షల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించని పక్షంలో 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అనంతరం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో మెడికల్ అధికారి డాక్టర్ అంజప్పను కలిసి వైద్యుడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లు, మందులు చూపించారు. ఆయన సూచనతో వేరే డయోగ్నస్టిక్ సెంటర్‌లో 2డి ఎకో చేయించి, ఆ రిపోర్టులు చూపించారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయని, మందులు వాడాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. దీంతో నిసరుద్దీన్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పరిశీలించిన కమిషన్-2 బెంచ్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు.. ఎలాంటి క్లినికల్ రిపోర్టులు లేకుండా అయిదేళ్లపాటు చికిత్స ఎలా కొనసాగించారని వైద్యుడిని ప్రశ్నించారు. ప్రతి వాద వైద్యుడు, హైదరాబాద్ నర్సింగ్‌హోం సంయుక్తంగా బాధితుడికి పరిహారం చెల్లించాలని తీర్పు వెల్లడించారు.
ఇవీ చూడండి: