ఏపీకి చెందిన వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ విచారణ కడపలో ప్రారంభమైంది. నిన్నటి వరకు పులివెందులలోని వైఎస్ వివేకానంద రెడ్డి నివాసంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టగా.. నేటి నుంచి కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న అతిథి గృహం, ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.
వివేకా హత్య కేసు: కడపలో సీబీఐ విచారణ ప్రారంభం - YS Viveka murder case news
వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నేటి నుంచి కడపలో ప్రారంభమైంది. అనుమానితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్య కేసు: కడపలో సీబీఐ విచారణ ప్రారంభం
హత్య కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్న ఆరుగురిని విచారిస్తున్నారు. వీరిలో ఎస్పీ హోదా ఉన్న ఓ మహిళ ఉండటం గమనార్హం. అనుమానితుల నుంచి సీబీఐ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.
ఇవీ చూడండి:తేనెపూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు: కేసీఆర్