ఎన్నికల విధుల్లో 17 ఏళ్ల బాలుడిని నియమించారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. సదరు అబ్బాయికి ఎన్నికల విధులు అప్పగించారనడంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
వెబ్ కాస్టింగ్ కోసమే బాలుడిని నియమించాం: ఎస్ఈసీ - మైనర్ బాలుడి ఎన్నికల విధులపై ఎస్ఈసీ వివరణ
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను ఉపయోగించుకుంటారని ఎస్ఈసీ స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో 17 ఏళ్ల బాలుడిని నియమించారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.
వెబ్ కాస్టింగ్ కోసమే బాలుడిని నియమించాం: ఎస్ఈసీ
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను ఉపయోగించుకుంటారని... అదే తరహాలో ఆ విద్యార్థిని వెబ్ కాస్టింగ్ కోసం నియమించినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇతర పోలింగ్ సిబ్బందితో పాటు వెబ్ కాస్టింగ్ విధుల్లో ఉన్న అబ్బాయి కూడా కూర్చొన్నారని ఎస్ఈసీ పేర్కొంది. అంతే తప్ప ఆ అబ్బాయికి ఎన్నికల విధులు అప్పగించలేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:'కేసీఆర్ కంటే పువ్వాడ గొప్పవాడనే విషయం నాకు తెలియదు'