హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నిజాంపేట్లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి.. ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయాడు. గల్లంతైన రకీబుల్ షేక్(36) కోసం అధికారులు రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. ఈరోజు ప్రగతినగర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా అందేలా చూస్తామని అధికారులు తెలిపారు.
నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం - exgratia
నిన్న రాత్రి కురిసిన వర్షం వల్ల ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లి నాలాలోపడి కొట్టుకుపోయాడు. గల్లంతైన ఆ వ్యక్తి మృతదేహం హైదరాబాద్ ప్రగతి నగర్ చెరువులో లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.
నాళాలో కొట్టుకోపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం