తాటాకు చప్పుళ్లకు తెరాస భయపడదన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొని సభ్యత్వాలు అందజేశారు. త్వరలో జరగబోయే కంటోన్మెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. నాలుగు సీట్లు గెలిచినంత మాత్రాన.. ప్రజలు భాజపాను నమ్మరని ఎద్దేవా చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యతగా స్వీకరించాలని క్రమశిక్షణ రహితంగా వ్యవహరిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని హెచ్చరించారు. తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సభ్యత్వం పొందేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
తాటాకు చప్పుళ్లకు భయపడం: తలసాని
కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేసి.. భారీగా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
తాటాకు చప్పుళ్లకు భయపడం: తలసాని
ఇవీ చూడండి: చంచల్గూడ జైలుకు నౌహీరా షేక్