'పుట్టినరోజు వేడుకలు వద్దు' - ఉగ్రవాదులు
భారతమాత 40మంది బిడ్డలను.. పోగొట్టుకున్న ఈ సమయంలో తన పుట్టిన రోజు జరుపుకోవడం సమంజసం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. జన్మదిన వేడుకలు జరపొద్దని తెరాస శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు. 40 మందిని పొట్టనపెట్టుకుని... వారి కుటుంబాలకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత బాధలో తన పుట్టినరోజు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. జన్మదిన వేడుకలు జరపొద్దని తెరాస శ్రేణులు, అభిమానులకు సీఎం విజ్ఞప్తి చేశారు.
Last Updated : Feb 15, 2019, 3:37 PM IST