తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాం నగల ధగధగలు

నిజాం రాజుల అరుదైన నగలను దిల్లీ మ్యూజియంలో ప్రదర్శించారు.  ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల్లో ఒకటైన జాకబ్ డైమాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది.

నేషనల్ మ్యూజియంలో నిజాం ఆభరణాలు

By

Published : Feb 19, 2019, 4:59 AM IST

నేషనల్ మ్యూజియంలో నిజాం ఆభరణాలు
హైదరాబాద్ నిజాం నగల ధగధగలు మరోసారి దిల్లీవాసులను అలరించనున్నాయి. ఇక్కడి నేషనల్ మ్యూజియంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్​శర్మ ఈ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఇలాంటి అరుదైన ప్రదర్శనల ద్వారా దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రజల ముందు ఆవిష్కరించే యత్నం చేస్తున్నామన్నారు.
ఈ మ్యూజియంలో వీటిని ప్రదర్శించటం ఇది మూడోసారి. ఇంతకుముందు హైదరాబాద్​లో రెండుసార్లు ప్రదర్శించారు. ఈ ఆభరణాల్లో వజ్రాలు పొదిగిన కంకణాలు, గాజులు, చెవిపోగులు, కవచాలు, ఉంగరాలు, నెక్లెస్​లు, వడ్డానం, బెల్టుల వంటి 173 రకాల నగలు ఉన్నాయి. కళ్లుచెదిరే 184.75 క్యారెట్ల జాకబ్ డైమాండ్ ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల్లో ఇది ఒకటి. ఈ నెల 19 నుంచి మే 5 వరకు ప్రజలను వీటి సందర్శనకు అనుమతిస్తారు.

ABOUT THE AUTHOR

...view details