తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియుడి మోజులో పడి - husband

హైదరాబాద్ అంబర్​పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడి మోజులో పడి భర్తనే హత్యచేయించింది ఓభార్య.

దారుణ హత్య

By

Published : Feb 15, 2019, 6:14 AM IST

Updated : Feb 16, 2019, 11:16 AM IST

దారుణ హత్య
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్యచేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్​ అంబర్​పేటకు చెందిన దివ్యాంగుడు చంద్రశేఖర్, వరలక్ష్మి భార్యభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. సుల్తాన్​బజార్​ ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్​లో హోంగార్డుగా పనిచేస్తున్న వెంకట్​రామ్​రెడ్డి, వరలక్ష్మితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన చంద్రశేఖర్ భార్యను హెచ్చరించాడు.

తమ బంధానికి అడ్డువస్తున్నాడని భావించిన వారిద్దరు.. చంద్రశేఖర్​ హత్యకు పథకం రచించారు. ఈ పనికి వెంకట్​రామ్​రెడ్డి​ తన మేనమామ కొడుకు నరేశ్​రెడ్డి సహాయం కోరాడు. గుప్తనిధుల వేట అలవాటు ఉన్న చంద్రశేఖర్​ను వెంకట్​రామ్​రెడ్డి, నరేశ్​రెడ్డి గత నెల 13న మంచాల ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు మద్యం సేవించిన అనంతరం చంద్రశేఖర్​ను హతమార్చి అక్కడే పూడ్చిపెట్టారు. పథకం ప్రకారం గత నెల 22న వరలక్ష్మి తన భర్త అదృశ్యమయ్యాడని అంబర్​పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కాల్​ డేటా పరిశీలించగా వరలక్ష్మి, వెంకట్​రామ్​రెడ్డి మధ్య ఎక్కువసార్లు సంభాషణ జరిగినట్లు గుర్తించారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. మంచాలలో శవాన్ని వెలికితీసి పంచనామ నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Feb 16, 2019, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details