విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు పెట్టారు. టీవీ9 లోగోను రూ.99వేలకు రవిప్రకాశ్ విక్రయించాడని కౌశిక్ రావు పేర్కొన్నారు. రవిప్రకాశ్‌తోపాటు ఎం.వి.కె.ఎన్ మూర్తి, హరికిరణ్ మీద ఈ కేసు నమోదు చేశారు. 406, 420, 467, 471, 120(బి) ఐపీసీ సెక్షన్లతో పాటు, 66, 72 ఐటీ ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
టీవీ9 లోగో అమ్ముకున్నాడని రవి ప్రకాశ్‌పై కేసు - tv9
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. టీవీ9 లోగోను అమ్ముకున్నాడని అలందమీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు.
రవి ప్రకాశ్