తెలంగాణ

telangana

ETV Bharat / state

TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష వారు కూడా రాసుకోవచ్చు

TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష పూర్తి సమాచార బులెటిన్, సిలబస్ విడుదలైంది. 2017 టెట్ సిలబస్ ప్రకారమే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తామని టెట్‌ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. పేపర్ 1 లేదా పేపర్ 2 లేదా రెండింటికీ కలిపి రుసుము మూడు వందల రూపాయలుగా నిర్ణయించారు.

TET 2022:  ఉపాధ్యాయ అర్హత పరీక్ష పూర్తి సమాచార బులెటిన్, సిలబస్ విడుదల
TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష పూర్తి సమాచార బులెటిన్, సిలబస్ విడుదల

By

Published : Mar 25, 2022, 4:43 PM IST

TET 2022: ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించిన పూర్తి సమాచార బులెటిన్‌, సిలబస్‌ను విడుదల చేసినట్లు కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. 2017 టెట్ సిలబస్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఈసారి బీఈడీ, డీఎల్ఈడీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. పేపర్‌-1 లేదా పేపర్‌-2 లేదా రెండింటికీ కలిపి రుసుము రూ.300గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్‌ 12న టెట్‌ పరీక్ష జరుగుతుంది. జూన్‌ 27న ఫలితాలు వెల్లడిస్తారు. టెట్‌కు సంబంధించి మార్చి 26 నుంచి హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.tstet.cgg.gov.inవెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ రాధారెడ్డి చెప్పారు.

ఒకసారి అర్హత సాధిస్తే..

TET EXAM: ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారమే విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. టెట్‌లో ఉత్తీర్ణులైన వారికే టీచర్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే.. జీవితకాలం వర్తిస్తుందని తెలిపింది.

జూన్‌ 12న టెట్: ఈ మేరకు జూన్‌ 12న టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో టెట్‌ పరీక్ష నిర్వహించారు. త్వరలో సుమారు 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుండటంతో.. టెట్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

టెట్‌లో మార్పులు : ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6-10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు 1-5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్‌-1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులు.

ఇదీ చదవండి:

టెట్ సమాచారం,​ సిలబస్​ కోసం : క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details