సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ సమీపంలోని పోచమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి వర్షం పడుతున్న సమయంలో దొంగలు వచ్చి చోరీకి పాల్పడి ఉంటారని ఆలయ కమిటీ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆలయం వెనుక భాగాన ఉన్న తలుపులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించి, హుండీ పగలగొట్టి అందులోని నగదు అపహరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలో నిర్మాణ పనులు జరుగుతున్నందున సీసీ కెమెరాలు పని చేయడం లేదని వారు వివరించారు. తాము కష్టపడి చందాలు వసూలు చేసి కట్టుకున్న ఆలయాంలో చోరీ చేయడం బాధాకరమని అన్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ చోరీ జరిగిన ఆలయంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
హుండీ పగలగొట్టి దొచుకెళ్లారు.. - సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్లో చోరి
నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు.. హుండీని పగలగొట్టి దుండగులు నగదును దొచుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ సమీపంలోని చోటుచేసుకుంది.
హుండీ పగలగొట్టి దొచుకెళ్లారు..